
చౌటుప్పల్ మండలం దామరలో నలగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మునుగోడు నియోజకవర్గం ఓటర్ల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి శుక్రవారం బిఆర్ఎస్ విద్యార్థి నాయకులు వినతి పత్రం అందజేశారు. కేటీఆర్ తో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తీర్మానం చేస్తూ మునుగోడు నియోజకవర్గంలో విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని. నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో చేసినట్టుగానే,ప్రస్తుతం కూడా తన సొంత క్యాడర్ ను మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని.ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సొంత క్యాడర్ అంత కూడా పార్టీకి మోసం చేసి ఇతర పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని కేటీఆర్ కు వివరించారు. కనీసం ఇప్పుడైనా మునుగోడు నియోజకవర్గం లో క్రియాశీలకంగా కష్టపడే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని. ప్రాధాన్యత ఇవ్వలేని ఎడల బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మునుగోడు నియోజకవర్గం పై పునరాలోచన చేసి విద్యార్థి నాయకులకు,యువజన సంఘం నాయకులకు కష్టపడే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చి పార్టీ బలోపేతం చేయాలని వినతి పత్రంలో కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారు లో మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి ముటుకుల్లోజు రాఘవ నాయకులు బంగారు వెంకటేష్,చాపల రవిశంకర్,మది రెడ్డి సాయి,గంట పురుషోత్తం,ఉదరి రాకేష్, గంగాదేవి గణేష్,ఏనుగుల మచ్చేందర్, శ్యామల చింటూ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.