న్యూఢిల్లీ : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ అవినీతిపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు అందింది. కాగా.. ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులకు లోక్‌పాల్ శుక్రవారం పలు సూచనలు చేసింది. మాధబిపై ఆర్థిక అవకతవకలకు సంబంధించి మరింత సమాచారాన్ని కోరింది. ఆమెపై ఉన్న ఆరోపణలను స్పష్టంగా తెలపాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల లోక్‌పాల్ బెంచ్ ఆదేశించింది. ఫిర్యాదు చేసిన వారిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మమువా మోయిత్రా ఒక్కరు. మొయిత్రా ఫిర్యాదు ప్రాథమిక విచారణకు ఆదేశించడానికి లోక్‌పాల్‌ను ఒప్పించలేకపోయిందని బెంచ్ పేర్కొంది.