డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదని ప్రజావాణిలో ఫిర్యాదు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వరం నగర్ గ్రామానికి చెందిన తిరుమలయ్య తల్లి మరణానికి చెందిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి ఇవ్వడం లేదని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి అఖిలని వివరణ కోరగా మరో గ్రామం నుండి ఇటీవల కాలంలో సిద్ధ రామేశ్వర నగర్ గ్రామానికి బదిలీపై రావడం జరిగిందని డిజిటల్ కి అందుబాటులో లేని కారణంగా మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఆలస్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారం చేసి మరణ ధ్రువీకరణ పత్రం కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.