నవతెలంగాణ-నవీపేట్: మండల కేంద్రంలోని ఆస్పత్రి భూమిని డాంగే పోతన్న ఆక్రమణ చేస్తున్నారని వైద్యులు ఎమ్మార్వో, తాహసిల్దార్, సర్పంచ్ పోలీస్ స్టేషన్ లలో సోమవారం ఫిర్యాదు చేశారు.ఆస్పత్రి స్థలంలో పశువుల కొట్టం, గడ్డి పెంచుతూ స్థలాన్ని కబ్జా చేసి ప్రయత్నం చేస్తున్నారని వెంటనే స్పందించి సర్వే చేసి హద్దులను నిర్ణయించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైద్యులు సాయి ప్రసాద్, చిన్నయ్య, భూపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.