విలేకరిని దూషించడం పట్ల ఏసీ పి కి ఫిర్యాదు..

నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలో టీ న్యూస్ విలేకరిగా పనిచేస్తున్న జలచందర్ గౌడ్ అలియాస్ జనా గౌడ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్ లోని జర్నలిస్టులు ఏసిపి ప్రభాకర్ రావు కు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ లో తెలంగాణ కేసరి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న సాతుపుతే శ్రీనివాస్ ను అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించిన టీ న్యూస్ ఛానల్ విలేఖరి జలచందర్ గౌడ్ అలియాస్ జానా గౌడ్ పై కేసు నమోదు చేయాలని గురువారం ఫిర్యాదు చేశారు. ఈనెల 7వ తేదీన ఆర్మూర్ లోని గుండ్ల చెరువు వద్ద సాగునీటి దినోత్సవం వార్తను కవర్ చేయడానికి వెళ్లిన శ్రీనివాస్ పై అకారణంగా, దురుద్దేశ పూర్వకంగా బూతు మాటలు తిట్టి బెదిరించిన టీ న్యూస్ విలేకరి జానా గౌడ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని కోరుతూ ఏసిపి ని కోరారు. ఇందులో పాల్గొన్న జర్నలిస్టులు గుమ్మడి శంకర్, దూద్ వాడ్ శీను, సంజీవ్, నరేందర్, గణేష్ గౌడ్,అమృతల శ్రావణ్,10 టివి చిరంజీవి, గంగా మోహన్, సురేష్, విన్సెంట్, చరణ్ గౌడ్, పురుషోత్తం, దినేష్, మహిపాల్, షికారి శ్రీనివాస్, జక్క రమణయ్య, ముఖేష్, వినోద్, రాంపూర్ శ్రావణ్, లిక్కి శ్రావణ్, మహేష్, సందీప్, పోహార్ క్రాంతి, చక్రధర్, గటడి అరుణ్,రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.