గిరిజనేతర భూ ఆక్రమణదారులు పై కలెక్టర్ అనుదీప్ కు పిర్యాదు..

– భూ ఆక్రమణలు పై సమగ్రమైన సర్వే చేస్తామని ఆర్.డి.ఓ స్వర్ణలత హామీ
– భూ బకాసురలు భరతం పడతాం
– ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ హెచ్చరిక
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం అశ్వరావుపేట రెవెన్యూ లోని పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ మరియు పట్టా భూములలో భూ బకాసురులు పెద్ద ఎత్తున భూములను ఆక్రమిస్తూ వెంచర్లు వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆదివాసీల జోలికి వస్తు అమాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ రెవిన్యూ రికార్డులను వారికున్న ఆర్థికంగా బలం తోటి మార్పులు చేసి ఆక్రమించిన వారి భరతం పడతామని ప్రతి ఒక్కరికి చట్టం రుచి ఏంటో చూపిస్తామని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆదివాసి సేన అశ్వారావుపేట మండల అధ్యక్షులు సోందెం సుమన్ హెచ్చరించారు. సోమవారం ఇట్టి విషయాల మీద సమగ్రమైన విచారణ జరపాలని కలెక్టర్ అనుదీప్ కు పిర్యాదు చేయగా ఆర్డీవో స్వర్ణలత విచారణ బాధ్యతలు తీసుకొని ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారని వారు తెలిపారు.
ప్రస్తుత అశ్వారావుపేట రెవెన్యూ లోని సర్వే నెంబర్: 108,297,911 లలో ప్రభుత్వ భూములు పేరు తోటి 1100 ఎకరాల పై చిలుకు విస్తీర్ణం నెలకొని ఉన్నది.ఈ భూములలో గతంలో నుంచి కూడా స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీలకు అసైన్మెంట్ పట్టాలు ప్రభుత్వం వారు గతంలో మంజూరు చేసి ఉన్నారు. అదే కాకుండా పైన తెలిపిన సర్వే నెంబర్లు 108,297 పేరు తోటి అంకమ్మ చెరువు శికం కింద 1100 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇంకా సర్వే నెంబర్ 911లో ఆదివాసి లు సాగులో ఉన్న భూములు ఉన్నాయి అని అయితే కొంతమంది ఆంధ్ర నుంచి వలస వచ్చినటువంటి గిరిజనేతరులు భూకబ్జాదారులు ఇట్టి భూములలో అమాయకులైన అటువంటి ఆదివాసీలను పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల అండదండల తోటి ఆదివాసీలను భయపెట్టి భూములను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ప్రభుత్వం వారు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేసి ఉన్నారు కానీ ఆ పట్టాలు చెల్లవని ఇది రిజిస్ట్రేషన్ భూమి అని పేర్కొంటూ లేని సర్వే నెంబర్లను సృష్టించి గత తాత ముత్తాతల కాలం నుంచి సాగులో ఉండి సేద్యం చేస్తున్న కూడా తప్పుడు ఆధారాలు సృష్టించి,రెవెన్యూ రికార్డులను మార్పులు చేర్పులు చేసి ఇవి మా భూములు అనీ దౌర్జన్యంగా వచ్చి గిరిజనులను భూమిలో నుంచి ఖాళీ చేస్తున్నారని ఇదేమి అన్యాయం అని ప్రశ్నిస్తున్న గిరిజనుల మీద వారికి ఉన్న రాజకీయ ఆర్థిక అంగ బలం తోటి భయభ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు కేసులు నమోదు చేయిస్తామని బెదిరిస్తున్నారు. స్థానికంగా ఉంటున్నటువంటి మీడియా మిత్రులు ప్రభుత్వ భూములు ఆదివాసుల భూములు ఆక్రమణకు, అన్యక్రాంతం నకు గురి అవుతున్నాయని పలుమార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చినా కూడా వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమరికి తెలియజేస్తున్నాను. అలాగే ఆదివాసి సంఘాల ద్వారా పేపర్ ప్రకటన ఇచ్చిన వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత వందల సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భూములలో రసీదులు కడుతూ, అనుభవదారుడుగా ఉంటూ వాస్తవ సాగులో ఉన్నా కూడా వారిని కూడా రౌడీలను పురమాయించి ఖాళీ చేయించారు.కనుక ఇట్టి సర్వే నెంబర్ల మీద మెజిస్ట్రేట్ తోటి సమగ్రమైన విచారణ జరిపి ప్రభుత్వ భూములను మరియు ఆదివాసీలకు సంబంధించినటువంటి సాగులో ఉన్న భూములను ఖాళీ చేయించిన భూములను అలాగే పట్టా పొందినటువంటి భూముల మీద సమగ్రమైన విచారణ జరిపి అక్రమార్కుల మీద పీడీ ఆకులు రౌడీషీట్లు ఓపెన్ చేయాలని అర్హులైన ఆదివాసీలకు భూములు పంపిణీ చేయాలని లేని పక్షంలో ఆదివాసి సేన అశ్వరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆదివాసీలను ఏకం చేసి ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టాదారు రైతులు ఆదివాసీల కార్యకర్తలు ఆదివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.