డబ్బులు ఇప్పించాలని కలెక్టర్ కు ఫిర్యాదు..

నవతెలంగాణ – మల్హర్ రావు
రుణాల,సర్టిఫికెట్ లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన మల్హర్ రావు మండల పరిషత్ కార్యాలయంలో పని చేసిన జూనియర్ అసిస్టెంట్ నక్క సంపత్ పై బాధితులు సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పిర్యాదు చేశారు. ఎస్సి,ఎస్టీ, బీసీ వికలాంగుల సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోని మోసం చేసిన మండలంలో విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోని తమ డబ్బులు ఇప్పించాలని 2018 సంవత్సరంలో పని చేస్తున్నప్పుడు తమ వద్ద నుండి రూ.22000 వెలు తీసుకున్నాడు.ఎప్పుడు అడిగిన కూడా రేపు మాపు అని కాలయానా చేస్తున్నాడు. ప్రస్తుతం పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలనీ కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.బాధితులు బత్తిని ఉమా,జాగారి అరవింద్,కొలకాని పుష్పలత,పల్లె రాజక్క లు ఉన్నారు.