ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో శుక్రవారం నాడు విద్యుత్ షాక్ తగిలి కొనగొల్ల రవి మరణించిన నేపథ్యంలో ఆగ్రహించిన గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారికి ఏ.ఇ, లైన్మెన్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న సాగర్ గ్రామ శివారులోని ఫ్యాక్టరీ దగ్గర 11 కెవి విద్యుత్ వైర్లు అతి తక్కువ ఎత్తులో కిందకు వేలాడుతున్నాయని, చాలాసార్లు విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్ లకి తెలిపామని, అయినా వారు నిర్లక్ష్యం చేస్తూ స్పందించకపోవడం కారణంగా నేడు రవి అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడని మండిపడ్డారు. విద్యుత్ శాఖ ఏ.ఇ, లైన్మెన్ లపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నసాగర్ గ్రామస్తులు గురు ప్రతాప్,కె ఎస్ రెడ్డి,సాయి యాదవ్, భీమయ్య, కురుమ సాయిబాబా, ఎండి గౌస్, పలువురు గ్రామస్తులు ఉన్నారు.