బీ ఆర్ ఎస్ నేతలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు

నవ తెలంగాణ- సిరిసిల్ల రూరల్:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన జరగగా ఆ బహిరంగ సభకు వచ్చిన వారికి బీ ఆర్ ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారని గురువారం న్యాయవాది కళ్యాణ్ చక్రవర్తి ఆర్డిఓ ఆనంద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. బీ ఆర్ ఎస్ నేతలు  ఆశ చూపి ఎన్నికల సందర్భంగా జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలను తీసుకువస్తూ వారికి డబ్బులు తున్న వీడియోలు బయటపడడంతో దీంట్లో భాగంగానే ఆర్డిఓ కు ఫిర్యాదు చేసినట్లు కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.