ప్రహరీ గోడ నిర్మాణం ఆపాలని ఎంపీడీవోకు ఫిర్యాదు

నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు,రజక వాడలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఎంపీడీవో శ్రీవాణీ కి రజకులు సోమవారం ఫిర్యాదు చేశారు. రజక వాడకు వెళ్లకుండా రోడ్డుపై ప్రహరీ నిర్మిస్తున్న. ముత్యాల రాజమ్మ మల్లయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చాకలివాడ నుండి కొత్తచెరువు వెళ్లే దారిలో అక్రమంగా రోడ్డుపై కందకం తీసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని. కొత్తగట్టు గ్రామానికి చెందిన 60 మంది రజకులు ఎంపీడీవో కార్యాలయం చేరుకొని ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కార్యదర్శి కి ఎంపీడీవో ఆదేశించారు.