
పట్టణంలో రోజురోజుకు అక్రమ నిర్మాణాల సంఖ్య పెరుగుతూనే ఉంది . పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద చిన్న బజార్ లో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణంపై కొందరు మున్సిపల్ కమిషనర్ కి బుధవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుని వివరాల ప్రకారం గోల్ బంగ్లా వద్ద చిన్న బజార్లో ఓ వ్యక్తి పాత ఇంటిని కూలగొట్టి, వారికి ప్రక్కన ఇంటి వారి మధ్య గోడను మొత్తం తొలగించి ఇతరుల ఆవరణలో పునాది బెడ్డు నిర్మాణం చేస్తున్నాడని, నిర్మాణానికి కావలసిన అనుమతులు కూడా లేవని, ప్రక్కింటి వారి గోడకు తన పిల్లర్లను ఆనించి పిల్లర్ల నిర్మాణం చేస్తున్నాడని, ఇద్దరి మధ్య అరసందు ఉండే అయిన అరసందు వదలడం లేదని, నిర్మాణ అనుమతుల ప్రకారం రోడ్డు సైడ్ సెట్ బ్యాక్ కూడా చేయకుండా నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి అట్టి అక్రమ నిర్మాణము పై తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కమిషనర్ ప్రసాద్ చౌహన్ చర్యలు ఏవైనా తీసుకుంటారా లేదా షరా మామూలేనా అని ప్రజలు నసుకుంటున్నారు. ప్రజలు వాహనాలు నడిరోడ్డుకు అక్రమిస్తున్నాడు రోడ్డుపై ఉన్న ఇల్లును మూడు ఫీట్లు తొలగించాలి కాలనీవాసులు ఎన్నిసార్లు చెప్పినా అందరిని బెదిరిస్తున్నాడని దీంతో కాలనీవాసులు తట్టుకోక కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది.