చౌటుప్పల్ చేనేత సంఘం అక్రమాలపై ఆర్డీవోకు ఫిర్యాదు..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షుల అక్రమాలపై నీలవేసినందుకు మాపై దాడి చేసి దుర్బల్లాడి మమ్మల్ని అవమానిస్తున్నారని చేనేత సహకార సంఘం పారిశ్రామికవేత్తలు పర్సన్ ఇంచార్జి కందగట్ల బిక్షపతి పాలకవర్గ సభ్యులపై విచారణ జరిపించి వెంటనే తొలగించాలని బుధవారం చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి కు వినతి పత్రం అందజేశారు. చేనేత ఏడి గారి ఆదేశాల మేరకు కొత్త వాటాలను నమోదు చేసుకోవాలని వారు సూచించారు. కానీ ఆక్రమంగా చేనేత సహకార సంఘం పర్సన్ ఇంచార్జి పాలకవర్గ డైరెక్టర్లు ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కొత్త వాటదనంగా సభ్యులను చేర్చుకుంటున్నారనీ,ఇదే విషయాన్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని దుర్భసలాడి మాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. కార్మికుల వాటాదనంతో నడుస్తున్న చేనేత సహకార సంఘాన్ని ఈ పాలకవర్గ సభ్యులు దోచుకొని సర్వ నాశనం చేశారని వారు తెలిపారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘ పారిశ్రామికులు గోశిక నరసింహ,లక్ష్మయ్య భాస్కర్ నరసింహ జెల్ల నారాయణ సుంకి రవికుమార్ కర్నాటి జనార్ధన్ వడ్డేపల్లి సత్యనారాయణ గోలి శ్రీను భాస్కర్ అప్పం జనార్ధన్ జెల్లా శ్రీనివాసులు చేనేత పారిశ్రామిక సంఘం నేతలు గోశిక స్వామి, గుర్రం నరసింహ వనం ధనంజయ రవి బిక్షపతి పురుషోత్తం లక్ష్మీనరసింహ నరహరి రుద్ర యాదగిరి ఆనంద్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.