సకాలంలో హాజరు కాని అధికారులపై కలెక్టర్ కు పిర్యాదు..

Complaint to the Collector against the officials who did not attend on time.– సంక్షేమ పధకాలకు పేదలే అర్హులు….
– వ్యాపార సముదాయంగా బస్టాండ్ ప్రాంగణం…
– ఎమ్మెల్యే జారే
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గల బస్టాండ్ ప్రాంగణాన్ని వ్యాపార సముదాయంగా తీర్చిదిద్దడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రజాపాలన లో పాల్గొనడానికి అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఆయన ఉదయం 6 గంటలు కే అశ్వారావుపేట బస్టాండ్ కు చేరుకుని ప్రాంగణంలో స్వచ్చ బస్టాండ్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం పనుల్లో పాల్గొన్నారు.ప్రాంణం మొత్తం శుభ్రం చేయించిన ఆయన త్వరలో ఈ ప్రాంగణాన్ని వ్యాపార సముదాయం గా తీర్చిదిద్దుతానని అన్నారు. ఉదయం 8 గంటలకు అశ్వారావుపేట ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభ వేదిక వద్దకు చేరుకున్నారు.అప్పటికే లబ్ధిదారులు,దరఖాస్తు దారులు,పలువురు పుర ప్రముఖులు వచ్చినప్పటికీ ముఖ్యమైన అధికారులు హాజరు కాకపోవడంతో అనుగ్రహించి వారి పై కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు పిర్యాదు చేసారు. అనంతరం తిరుమలకుంట,గాండ్లగూడెం,కోయ రంగాపురం గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామ సభల్లో ప్రకటించే అర్హుల జాబితా నే తుది జాబితా కాదని అది ఒక అంచనా పత్రం మాత్రం మే నని అన్నారు.కుటుంబ సామాజిక,ఆర్ధిక సర్వే ప్రకారం మే సంక్షేమ పధకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,మండల ప్రత్యేక అధికారి,పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్,ఎం.పి.డీ.ఓ ప్రవీణ్ కుమార్,ఎం.పీ.ఈ.ఓ సోయం ప్రసాదరావు,ఐటీడీఏ డీఈ బాపనయ్య,ఏవో శివరాం ప్రసాద్,ఐబీ ఏఈ కేఎన్బీ క్రిష్ణ,పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,కాంగ్రెస్ మండల అద్యక్షుడు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,నండ్రు రమేష్,ప్రమోద్,మిండ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.