
రెంజల్ మండలం నీలా పేపర్ మిల్ గ్రామ సమీపంలో నిజామాబాద్ టు చెందిన వ్యక్తి పేపర్ మిల్లు స్థలాన్ని కొనుగోలు చేసి అక్రమంగా ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారని, పేపర్ మిల్లు గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణం వల్ల డి50/2/17 వ్యవసాయ కాలువను సైతం కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఇటీవల ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కాలువ ఉన్న మాట వాస్తవాన్ని దీని మరమ్మత్తుల కోసం నాలుగు లక్షల 50 వేల రూపాయల ప్రతిపాదనలు కూడా పంపినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఈ రోడ్డు ద్వారా సీలింగ్ భూములు ఉన్న రైతులు వెళ్లడానికి ఉండేదని, ప్రస్తుతం వారిని అటు రాకుండా అడ్డుగా గోడ కట్టడం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది అని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముఖి, అవేజ్, నీలు ఖాన్, జలాలుద్దీ న్, గంగాధర్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.