నవతెలంగాణ – ఆర్మూర్
తప్పుడు కేసులు చేయిస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని మండలంలోని గోవింద్ పెట్ గ్రామానికి చెందిన పడాల సరస్వతి శనివారం జిల్లా సీపీకి ఫిర్యాదు చేసినారు. వివరాలు ఇలా ఉన్నవి. మండలంలోని సురిబిర్యాల్ గ్రామానికి చెందిన అశ్విన్ రెడ్డి అనే వ్యక్తి తన కుమారుడి భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఇంటిని ఆక్రమించుకొని కల్లు మాముల విషయంలో ఇబ్బందులు చేస్తూ తప్పుడు కేసులు చేయిస్తున్నందున చర్యలు తీసుకోవాలని కోరినారు. మండలంలోని గోవింద్ పెట్ గ్రామానికి చెందిన తన కుమారుడు మోహన్ గౌడ్ కు ఆర్మూర్ కు చెందిన సుమలతతో 2009లో వివాహం జరిగిందన్నారు. 2014లో తన కుమారుడిపై వరకట్నం కేసు నమోదు చేయించి భయపెట్టి తన పేరు ఉన్న ఇంటిని రాయించుకుందన్నారు. తన కుమారుడితో గొడవ పడుతూ సుర్బిర్యాల్ కు చెందిన అశ్విన్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తుందన్నారు. తన కుమారుడిని నమ్మించి దుబాయ్ కి పంపించి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి సహజీవనం చేసిందన్నారు. ఈమధ్య తన కుమారుడు దుబాయ్ నుంచి రావడంతో వాస్తవాలు తెలిసి నిలదీస్తే ఇంట్లో నుంచి తనను, తన కుమారుడిని వెళ్లగొట్టిందన్నారు. ప్రస్తుతం తాము వేరేచోట ఉంటున్నట్లు చెప్పారు. తనకు సంబంధించిన కళ్ళు మామూల డబ్బులు సైతం రాకుండా తనకే రావాలని తన కోడలు సుమలత గొడవ చేస్తుందన్నారు. ఈ విషయమై తమపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వాస్తవానికి కల్లుు మాముల డబ్బులు తనకు రావాల్సి ఉంటుందని చెప్పారు. అశ్విన్ రెడ్డి తమకు భయపెడుతున్నందున అతనితో ప్రాణహాని ఉందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాలు అండగా నిలిచి ఆయన ఇంటి ఎదుట ధర్నా చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో విచారణ జరిపి తమ ఆస్తులు తమకు ఇప్పించి అతనిపై పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.