భూ ఆక్రమణదారుడిపై వరంగల్‌ రేంజ్‌ ఐజీ రంగనాథ్‌కు ఫిర్యాదు

నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్మెంట్‌ లెక్చరర్‌ దాస్యం రూత్‌ మేరీకి సంబంధించిన 400 గజాల స్థలం స్థానిక నాయకులు అక్రమంగా అక్రమించుకున్నారని, అడిగితే బెదిరింపుకులకు పాల్పడుతున్నారని శనివారం వరంగల్‌ రేంజ్‌ ఐజి ఏవీ.రంగనాథ్‌ని కలిసి తమ సమస్యను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. బాదితురాలికి న్యాయం కోసం ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అంతా దాస్యం రూత్‌ మేరీకి అండగా నిలబడుతూ న్యాయం కావాలని రంగనాథ్‌ని కలిసి విన్నవించారు. తాను రిటైర్మెంట్‌ తరువాత వచ్చిన డబ్బులతో ఫ్లాట్లు కొనుక్కుంటే ఆ ఫ్లాట్ల కాగితాలను అక్రమంగా నా దగ్గర నుంచి మాయమాటలు చెప్పి తీసుకుపోయి అన్ని ఫ్లాట్లు అమ్ముకొని ఆఖరికి నా ఇంటి పక్కన ఉన్న నా ఆధీనంలో మరికొంత స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నారని, ఈ విషయంలో న్యాయం కోసం స్థానిక పోలీసు అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. న్యాయం కోసం మీ దగ్గరికి రావడం జరిగిందని విన్నవించారు. ఐజిని కలిసిన వారిలో విద్యార్ధి సంఘాల నాయకులు కోటా శివశంకర్‌, ఓల్డ్‌ స్టూడెంట్‌ తదితరులు ఉన్నారు.