పరిష్కార వేదికలో వెల్లువెత్తిన ఫిర్యాదులు..

– 101 యూనిట్ల వరకు దళితులకు సబ్సిడీ కరెంటు అందించడానికి పరిష్కారం
– మద్నూర్ మండల భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షులు చాట్ల గోపాల్ కృషి అభినందనీయం
నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గల సబ్ స్టేషన్ కార్యాలయవరణంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక బుధవారం నాడు నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక సిజిఆర్ ఈ చైర్పర్సన్ కె ఈశ్వరయ్య అధ్యక్షతన జరగగా పరిష్కార వేదికలో ఫిర్యాదులు వెల్లువెత్యాయి. అందిన ఫిర్యాదులపై పరిష్కార మార్గం ఉంటుందని ఉన్నత అధికారులు ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు పరిష్కార వేదికలో పరిష్కరించు సమస్యలు విద్యుత్ సరఫరా లో తరచుగా వచ్చు అంతరాయంలు విద్యుత్ హెచ్చుతగ్గు సమస్యలు విద్యుత్ మీటరు సమస్యలు విద్యుత్ మీటర్ ఎక్కువగా తిరుగుట ఆగిపోవుట కిక్కు కాలిపోవుట స్పీక్ కాలిపోవుట విద్యుత్ బిల్లులోని సమస్యలు ఎక్కువ బిల్లులు వచ్చుట క్రొత్త సర్వీసులు గాని అదనపు లోడు ఇచ్చుటకు నిరాకరణ లేక జాప్యం డ్రిస్టు భూషణ్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు ఓవర్ లోడు కాలిపోవుట తరలించుట విద్యుత్ బిల్లులో పేరు మార్చుటకు ఎల్టి కేటగిరి మార్చుటకు ఫేస్ మార్చుటకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇతర సమస్యలు ఇలాంటి సమస్యలపై పరిష్కార వేదిక ఫిర్యాదులపై పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి అశోక్ మెంబర్  టెక్నికల్ ఎల్ కిషన్ మెంబర్ ఫైనాన్స్ ఎం రాజా గౌడ్ ఫోర్త్ మెంబర్ ఏడి కామేశ్వర్ ఏడి ఈ రామకృష్ణ ఏ ఈ లు రమేష్ అరవింద్ వీరితోటు బిచ్కుంద జుక్కల్ మండలాల ఏఈలు ఆయా సబ్ స్టేషన్ లో పరిధిలోని కరెంటు వినియోగదారులు వ్యవసాయదారులు మద్నూర్ బిచ్కుంద మండలాలకు చెందిన భారతీయ కిసాన్ సాంగ్ అధ్యక్షులు కరెంటు అధికారులు పాల్గొన్నారు.