
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని శ్రీధర్ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యమందిర్ లో యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీధర్ , అనంత్ రావ్ లు మాట్లాడుతు యోగా తోనే మనిషి సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాగలుగుతారు అని అన్నారు. భారతీయులకు యోగా ఆరోగ్య సంజీవని అని చెప్పక తప్పదని ఎన్నో ఆనారోగ్యా సమస్యల కు చక్కటి పరిష్కారం యోగా ద్వారా లభిస్తుంది. .కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోది బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాల కు చాటి చెప్పడమే కాకుండా ప్రపంచ యోగా దినోత్సవం గా జరుపుకునేలా గుర్తింపు తీసుకొచ్చారు.ఇది భారతీయలుగా మనం గర్వించదగిన విషయమనీ నేడు 10వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం అందున ఈ యోగా దినోత్సవాన్ని యోగా హుమినిటి అనే నామకరణంను చేయడం జరిగిందన్నారు. యోగాను కేవలం యోగా రోజున మాత్రమే కాకుండా ప్రతి రోజు నిత్యజీవితంలో బాగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జే.జే నర్సయ్య , అనంత్ రావ్,గణేష్,శ్రీధర్, పిట్ల బాపురావ్ , లింబాద్రి,నవీన్,బాలయ్య, చా రి, ఫోటోస్టూడియో శ్రీనివాస్,,శ్రీను, శ్యామ్ , శ్రీనివాస్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.