అంగన్వాడీలో సంపూర్ణ అక్షరాస్యత

Complete literacy in Anganwadiనవతెలంగాణ – కొనరావుపేట 

మండలంలోని నిజామాబాద్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ కనకమ్మ మాట్లాడుతూ..అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు విద్యను అభ్యసించడమే కాకుండా పౌష్టికాహారాన్ని అందిస్తామని దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మేధాశక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత అంగన్వాడీలు ఐ విజయలక్ష్మి. బి విజయలక్ష్మి ఆయాలు పాల్గొన్నారు.