నవతెలంగాణ – జుక్కల్ : పెండింగ్ రికార్డులను పూర్తీ చేసి పన్నులు వందశాతం వసూళ్లు చేయాలని జుక్కల్ ఎంపిడీవో శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం నాడు మండలంలోని నాగల్ గావ్ గ్రామములోని జీపీ భవనం, పోలింగ్ బూత్ భవనం లలో మౌళికవసతులైన మరుగుదొడ్లు, మూత్రశాలలు భవనం పరీశీలించారు. ఈ సంధర్భంగా ఎంపియూపీఎస్ పాఠశాల లో ఎన్ని కలు నిర్వహించే భవనాల పరీశీలన చేసిన అనంతరం జీపీ భవనంలోని పలు రకాలైన రికార్జులను పరీశీలించారు, వందశాతం పన్నులు వసూళ్లు చేపట్టాలని జీపీ కార్యదర్శి హరీష్ ను ఆదేశించారు. గ్రామములో ఆభివృద్ది పనులైన నర్సరీల నిర్వహణ, హరితహరం, డంపింగ్ యార్జులు, చెత్త సేకరణ, వేసవిలో నీటి సమస్యలు కలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపిడీవో శ్రీనివాస్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు జీపీ కార్సదర్శి హరీష్, ఇంచార్జీ హెచ్ఎం ఉమర్ , ఉపాద్యాయుడు సంజయ్ మాజీ సర్పంచ్ అనీల్, గ్రామస్తులు బాబు పటేల్, తదితరులు పాల్గోన్నారు.