రైల్వే ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయండి

– ద.మ.రైల్వే జీఎమ్‌తో ఆర్థికమంత్రి హరీశ్‌రావు భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తిచేయాలని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ను కోరారు. బుధవారంనాడాయన పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకరరెడ్డితో కలిసి సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో జీఎమ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేటాయించిన రైలు ప్రాజెక్టులపై చర్చించారు. రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనుల్ని కూడా వేగవంతం చేసి, ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మంత్రి సూచనలపై జీఎమ్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సానుకూలంగా స్పందించారు.