హైదరాబాద్ : 20 జిల్లాలు పోటీపడిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో పోటీలు ఆదివారం ముగిశాయి. సీనియర్ మెన్ విభాగంలో నిజామాబాద్ స్వర్ణం సాధించగా.. ఆదిలాబాద్, కల్వకుర్తి జట్లు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నాయి. సీనియర్ ఉమెన్ విభాగంలో హైదరాబాద్ బంగారు పతకం గెల్చుకోగా.. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లు టాప్-3లో నిలిచాయి. జూనియర్ బాలికల విభాగంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కల్వకుర్తి…బాలుర విభాగంలో మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్‌లు పతకాలు సాధించాయి. ఎస్‌ఆర్ ప్రైమ్ విద్యాసంస్థల చైర్మన్ వరద రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. తెలంగాణ సైకిల్ పోలో సంఘం అధ్యక్షుడు జీవరత్నం, ప్రధాన కార్యదర్శి ఎం. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ స్టాఫ్ చందర్‌రావు, మహేశ్, హజీరాబేగం, రామారావు, వెంకటేశ్, శ్రీను సహా వ్యాయాయ విద్య ఉపాధ్యాయులు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.