వ్యవసాయ వ్యాపార వ్యవహారాలపై ముగిసిన ఆన్లైన్ శిక్షణ..

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కళాశాలలోని వ్యవసాయ విస్తరణ విభాగం నిర్వహిస్తున్న మూడు రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది.
గత మూడు రోజులు అనగా  జూన్ 5 నుండి 7 వ తారీఖు వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం లో వ్యవసాయ వ్యాపార అంశాల పై దేశం లోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు వివిధ అంశాల పై అవగాహన కల్పించారు.  వ్యవసాయ విస్తరణా విభాగం లో పేరుగాంచిన సంస్థ “మేనేజ్” (నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మానెజ్మెంట్) వారి సౌజన్యం తో స్థానిక వ్యవసాయ కలశాల లోని డాక్టర్  టి.శ్రావణ్ కుమార్ నిర్వహించారు. ఈ ముగింపు సభ లో ముఖ్య అతిధి గా సెంటర్ ఫర్ జెండర్ స్టడీస్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న  డాక్టర్ వినీత కుమారి పాల్గొన్నారు. ఇదే తరహా కార్యక్రమాలు ఇంకా వ్యవసాయ కళాశాలలో ఎన్నో జరిపి కలశాల కీర్తి ని పెంపొందించాలని అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ అభిప్రాయపడ్డారు.