నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్టు సర్పంచ్ టేకు తిరుపతి తెలిపారు.శనివారం గ్రామ సర్పంచ్ టేకు తిరుపతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వహాకులను అభినందించారు. నిర్దేశించిన సుమారు 5500 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని అధిగమించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 6500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని నిర్వహాకులు తెలిపారు. సీఏ మంగ, గ్రామ రైతులు పాల్గొన్నారు.