– శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం హైదర్ నగర్ డివిజన్ పరిధి రాం నరేష్ నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టవల్సిన పలు అభివద్ధి పనులపై స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడు తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సంతులిత, సమగ్ర అభివద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. దశల వారిగా అభివద్ధి పనులు చేపడుతామని తెలిపారు. కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి తెలుసుకొని సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాం నరేష్ నగర్ కాలనీ అభివద్ధికి కషి చేస్తానన్నారు. కాలనీని అన్ని రంగాలలో అభివద్ధి చేస్తానని, డ్రయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని తెలిపారు. త్వరలోనే డ్రయినేజీ నిర్మాణం మ్యాన్ హౌల్స్ మరమ్మత్తులు చేపట్టాలని, అవసరమున్న చోట కొత్త మ్యాన్ హౌల్స్ చేపట్టాలని, త్వరలోనే రోడ్డు నిర్మాణము పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. రోడ్డును త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, జీహెచ్‌ఎంసీ ఎఈ రాజీవ్, జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.