వరిలో కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా అందించ కూడదు…

నవతెలంగాణ – తొగుట

వరి పంట లో కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా అందించకూడదని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని పెద్ద మాసాన్ పల్లి గ్రామ రైతు దాస రి దశరథం వరి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ భాస్వరం మొక్క వేరు వ్యవస్థ పెరుగుదలకు సహాయపడుతుందని, భాస్వరాన్ని చివరి దుక్కిలో లేదా నాటిన 5 రోజుల లోపు వేయాలని అన్నారు. కాంప్లెక్స్, డిఏపి ఎరు వులకు నెమ్మదిగా కరిగే స్వభావం ఉంటుంది కాబ ట్టి వీటిని పై పాటుగా అందించడం వలన కావలసి న సమయంలో పోషకాలు మొక్కలకు అందే అవ కాశం ఉండదని తెలిపారు. దీనివల్ల పంటకు ఎటు వంటి ప్రయోజనం ఉండదు పై గా భూమిలో భాస్వ రం శాతం పెరగడం ద్వారా జింక్ పోషక లోపం ఏర్పడుతుందని వివరించారు. పంట కాలాన్ని బట్టి యూరియాను మూడు, నాలుగు దఫాలుగా వేసు కోవాలని పేర్కొన్నారు. దుక్కిలో ఎకరాకు 50 కిలో ల డిఏపి, వేసుకోవాలి నాటిన 12-15 రోజుల లోపు 35కిలోల యూరియాను ,15 కిలోల పొటాష్ కలిపి వేయాలని చెప్పారు. మొక్క పిలుకలు వేసే ధశలో 35కిలోల యూరియా మరియు అంకురం తొడిగే దశలో మూడో 35 కిలోల యూరియా,15 కిలోల పొటాష్ వేయడం వలన పంట ఏపుగా పెరిగి మంచి దశకు చేరుకుంటుందన్నారు. యూరి యాతో త్రీ జి, ఫోర్ జి గుళికలు కలపడం వలన గుళికల యొక్క సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. యూరియాతో పురుగుల మందు, కలుపు మందు లు కలిపి వాడరాదని సూచించారు. ఈ కార్యక్ర మంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.