బాలమేళాను సందర్శించిన కాంప్లెక్సు హెచ్.యం హరిత

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పేట మాలపల్లి,అశ్వారావుపేట (ఉర్దూ) పాఠశాలల్లో నిర్వహిస్తున్న బాల మేళా – 2025 ను బుధవారం కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత సందర్శించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను తెలుసుకున్నారు.తెలుగు,ఆంగ్లం,గణితం లలో విద్యార్ధులకు ప్లేకార్డ్సు ద్వారా వారి నైపుణ్యాలను ప్రదర్శింప చేశారు. గణిత సామర్ధ్యాలను ఆటల ద్వారా ప్రదర్శింప చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంప్లక్సు సీ.ఆర్.పీ ప్రభాకరాచార్యులు, ఆర్.పి సత్యనారాయణ, ఉపాధ్యాయులు అరుణ, సుజాత, కృష్ణవేణి, హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.