తెలంగాణ మండల టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ హెచ్ఎం వై. శ్రీనివాస్ ను ఘణంగా మండల టీచర్లు సన్మానించారు. ఈ సంధర్భంగ కాంప్లేక్స్ హెచ్ఎంగా బాద్యతలు తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతు జుక్కల్ మండలంలోని కౌలాస్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రదాన ఉపాద్యాయునిగా విధులుు నిర్వహిస్తు కాంప్లేక్స్ హెచ్ఎంగా అదనపు బాద్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఉపాద్యాయులు బాద్యతగా విధులు నిర్వహించాలని మంచివిద్య బోదన చేసి విద్యార్థుల మంచి మార్గంలో ప్రయాణించి మంచిస్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని కౌలాస్ క్లస్టర్ పరిది ఉపాద్యాయులను కోరారు. అంతకు ముందు మండల టీటీయూ ఉపాద్యాయ సంఘం అద్యక్షులు కే. సాయులు, మండల టీటీయూ సంఘం కార్యదర్శి ఎస్ కే .ఉమర్, రమేష్ తదితరులు శాలువా పుష్పగుచ్చం అందించి కాంప్లెక్స్ హెచ్ఎంను సన్మానించారు.