
మండలంలోని జేఏఎస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ డిప్యూటి డిఎంహెచ్వో శిరీష ఆధ్వర్యంలో సమావేశం మండల కేంద్రంలోని రైతువేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా ఎంపిపి సుర్నార్ యశోదా పాల్గోన్నారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన జాస్ కమిటి శిక్షణ సమావేశంలో సమావేశంలో డిప్యూటి డిఎండిచ్వో శిరిష మాట్లాడుతు ప్రాథమిక ఆసుపత్రిలో, ఆరోగ్యఉప కేంద్రాలలో జాష్ కమిటి రోగికి అందిచాల్సిన సేవలు కొనసాగింపు, జాష్ కూర్పు, వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా విది విదానాలను, ఆయష్మాన్ భారత్ కింద ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాలు, పల్లే దవఖానాలు రూపు దిద్దుకోవడం, నిశ్నార్థులైన వైద్య సిబ్బందితో మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎంపిపి యశోదా మాట్లాడుతు ప్రతి మూడవ శనివారం నాడు పల్లే దవఖానాలలో సిస్టర్లు సమావేశాలు నిర్వహించు కోవాలని, కమిటి అందరిని సమన్వయే పరిచే బాద్యత సంభందిత డాక్టర్ , సిస్టర్లదే బాద్యత అని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎంపిపి, డిప్యూటి డిఎంచ్వో , స్థానిక సర్పంచ్ బొంపెలి రాములు , మాదాపూర్ జల్దేవార్ దినేష్ , రవిపటేల్, స్టాఫ్ నర్స్ యేాగేష్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గోన్నారు.