నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి గాదరి కిషోర్ తోనే సాధ్యం

–  సతీమణి గాదరి కమల
నవతెలంగాణ- నూతనకల్: తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి గాదరికిషోర్ తోనే సాధ్యమవుతుందని గాదరి కిషోర్ కుమార్ సతీమణి కమల అన్నారు . మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను, అమలు చేసే సంక్షేమ పథకాలను ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. నియోజకవర్గం లో గత పాలకుల కాలంలో నిత్యం హత్యలు అత్యాచారాలతో రక్తపాతంగా ఉన్న నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కిషోర్ కె దక్కిందని అన్నారు. మూడవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూ రెడ్డి కళావతి సంజీవరెడ్డి జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి వైస్ ఎంపీపీ జక్కి పరమేష్ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, ఎర్రపహాడ్ ఎంపిటిసి గాడిదల రజిత లింగరాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చూడి లింగారెడ్డి సతీమణి చూడి దివ్య మహిళ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.