మా పోరాటాలతోనే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి.

– సిపిఎం అంటేనే ప్రజల గొంతుక. 
– ఆశీర్వదించండి అభివృద్ధికి సహకరించండి .
– సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహ
నవతెలంగాణ – భువనగిరి. నిరుపేద ఇంటిలో పుట్టి కష్టనష్టాలకు ఓర్చీ విద్యార్థి దశ నుండే రాజకీయాలలోకి వచ్చి  ప్రజానాట్య మండలి, కులవివక్షత ,వ్యవసాయ కార్మికుల నాయకుడిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్న సిపిఐఎం భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా కొండమడుగు నరసింహ పోటీ చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుంది. సాంస్కృతిక సామాజిక కార్యకర్తగా, వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నాయకుడిగా, కూలీ, భూమి సమస్యలపై కార్మిక సంస్థలపై పోరాడిన అనుభవం గడించారు. 35 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పని చేస్తూ సుమారు 20 సంవత్సరాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిపిఎం పూర్తికాల కార్యకర్తగా పనిచేశారు. ప్రస్తుతం మన జిల్లాలో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గం లో సాగు, తాగునీరు మూసి కాలుష్యం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యా, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి అవకాశాలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడతానని ఎన్నికలు ప్రచారంలో  పేర్కొంటున్నారు .ఈ సందర్భంగా నవ తెలంగాణతో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో ఏ సమస్యలు గుర్తించారు ? 
భువనగిరి నియోజకవర్గం లో పునాది గాని కాలువ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు పూర్తి కాలేదు. వనపర్తికత్వలోకి గోదావరి జలాల కోసం బస్వాపురం రిజర్వాయర్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి భూనిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు మూసి ప్రక్షాళన మూసి జల కాలుష్యము పరిశ్రమల వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యాలయాలు లేవు. భువనగిరి పట్టణంలో కనీసం కవులు కళాకారులకు సాంస్కృతి భవనము, టౌన్ హాల్ లేదు. క్రీడాకారుల కోసం అవుట్డోర్ స్టేడియం ఏర్పాటు చేయవలసి ఉంది. మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన మహిళ వైద్యశాలలు వారి ఉపాధి కోసం వృత్తి ,విద్య కేంద్రాలను ఏర్పాటు చేయవలసి ఉంది. రైల్వే ను విస్తరణ చేసి వివిధ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల కోసం హాల్టింగ్ సమస్య ఉంది.
ప్ర: ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు మీకు ఉన్న తేడా? 
జ: భువనగిరి నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి కి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి కనీసం ప్రజా సమస్యలపై నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేదు.  ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర లేదు.  వ్యాపార సంబంధాలు తప్ప రాజకీయాల్లో ప్రజలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వారు తను మాత్రం 1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు సిపిఎం పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తూ భువనగిరి నియోజకవర్గం పై పూర్తి అవగాహన ఉంది. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం లో తన భాగస్వామ్యం ఉంది. కూలీ భూమి సామాజిక ఉద్యమాలు విద్యుత్ చార్జీల పెంపు సాగు తాగునీరు ఉద్యమాలు లాంటి అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించాను ప్రతి గ్రామం పై సంపూర్ణ అవగాహన ఉంది కళాకారునిగా ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత  చదువు వెలుగు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో తిరిగి చైతన్యవంతం చేసినాను.
 ప్ర: మీకు సహకరించే అంశాలు. 
జ: అన్ని పరకాల ప్రజల మద్దతు ఉంది రైతులు వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ కూలీలు వృత్తిదారులు సంఘటిత ఆ సంఘటిత కార్మికులు దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళలు ఆయా తరగతుల సమస్యల పైన పోరాటంతో నన్ను తమ వానిగా గుర్తిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సిపిఎం కు కార్యకర్తల బలం ఉంది.