సమగ్ర కుటుంబ కులగణన సర్వే పారదర్శకంగా జరగలేదు..

– ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్..
నవతెలంగాణ-వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ, కులగణన సర్వే పారదర్శకంగా, పటిస్టవంతంగా, సంపూర్ణంగా జరుగలేదని మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుండి సుమారు 50 రోజులపాటుగా రాష్ట్రంలో సమగ్ర కుటుంబ కులగణన సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది,  సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల, తదితర అంశాల సేకరణపై సమగ్ర సర్వే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన, సమగ్ర కుటుంబ కుల సర్వే ప్రభుత్వం ఆధర బాధరగా చేపట్టిందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయిందని ఆయన తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే సంబంధిత అధికారులు ఇండ్ల వద్దకు వచ్చిన సమయంలో ఉద్యోగరీత్యా, వ్యాపారరిత్య, ఇతరత్రా కారణాల వల్ల ఇండ్లలో యజమానులు లేకపోవడం, డోర్ లాక్ ఉండడం, కొంత మంది సమాచారాన్ని ఇచ్చుటకు నిరాకరించడం వలన చాల కుటుంబాల వివరాలను అధికారులు సేకరించలేక పోయారని వెల్లడించారు. మిస్ అయిన వారి వివరాలను, డోర్ లాక్ ఉన్న వారి కుటుంబాల వివరాలను మళ్లీ ప్రత్యేకంగా సర్వే చేసి వారందరి వివరాలను సేకరించాలని నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు. డోర్ లాక్ ఇతర కారణాల వలన మిస్ అయిన వారి వివరాలను సేకరించనిచో అసమగ్రంగా కులగణన సర్వే జరిగినట్లు అవుతుందని ,బీసీ లకు అన్యాయం జరుగుతుందని అన్నారు.గత ప్రభుత్వంలో జరిగిన సర్వేలో బీసీ జనాభా 52 శాతం ఉన్నదనీ, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే లో 46 శాతం ఉండడం హాస్యాస్పదమని, మల్లి సర్వే చేసి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు చేసిన రిజర్వేషన్లు, విద్య, ఉపాధి తదితర అంశాలపై చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ నెల 6 న వేములవాడలో జరుగనున్న జిల్లా బీసీ సాధికారిత సంఘం సమావేశంలో బీసీల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు.