మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలొ కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరును మండల ప్రత్యేక అధికారి మూతెన్నా, ఎంపీఓ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 12186 కుటుంబాల సర్వే వివరాలను డాటా ఎంట్రీ ఆపరెటర్ల సహాయంతో ఏంట్రీ చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.