ఇంటిటి సమగ్ర కుటుంబ సర్వే 98 శాతం పూర్తి..

Comprehensive family survey of the house is 98 percent complete..– జిల్లా కలెక్టర్ హనుమంతరావు ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈనెల తొమ్మిదవ తేదీ నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ  సర్వే సుమారుగా 98 శాతం పూర్తి అయిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని  మండలంలో కానీ,  గ్రామపంచాయతీలలో, మీ ఆవాస ప్రాంతాల్లో ఎవరైనా సర్వే నిర్వహణకు  సంబంధించిన అధికారులు మీ వద్దకు రాకున్నా ,  మీరు అందుబాటులో లేకపోవడం లేదా మీ ఇంటికి తాళం వేసి ఉన్న సందర్భంలో గానీ సర్వేలో నమోదు కానీ కుటుంబాల వారు దయచేసి  100% నమోదు కొరకు అందరు కూడా సహకరించగలరని కోరారు .ఇందులో భాగంగా సర్వే లో ఇంకా మిగిలిన ఉన్న కుటుంబాలు  సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి,  మీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి  చరవాణి ద్వారా లేదా ప్రత్యక్షంగా సంప్రదించి , సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లా నోడల్ అధికారి /జిల్లా స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ గంగాధర్ ని సంప్రదించి మీ కుటుంబాన్ని ఇట్టి సర్వేలో నమోదు చేయించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్  హనుమంతరావు  ఒక ప్రకటన లో కోరారు.