
సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, కులగణన, సమగ్ర సర్వే ఆన్ లైన్ డేటా ఎంట్రీ ని ఎలాంటి తప్పులకు తావు లేకుండా ప్రతి కుటుంబ వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం భువనగిరి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో కొనసాగుతున్న సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ ను సునిశితంగా పరిశీలించారు. డేటా ఆపరేటర్లు తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎన్యుమరేటర్ తప్పని సరిగా దగ్గర ఉండి నమోదు చేయించాలని అన్నారు.సర్వే డేటా ఎంట్రీ లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి కుటుంబ వివరాలను క్షుణ్ణంగా, సజావుగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఆపరేటర్లకు దిశ నిర్దేశం చేశారు. ఈప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సర్వే కు సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తి చేసిన పత్రాలు స్ట్రాంగ్ రూమ్ లో చాలా జాగ్రతగా బాక్స్ లో భద్రపరిచిన వాటిని కలెక్టర్ పరిశీలించారు. భువనగిరి ఎంపీడీఓ శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.