సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మంగ పాండరీ , తిరుపతిలు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించేది లేదని అన్నారు. 20 సంవత్సరాలుగా శ్రమ దోపిడీ చేస్తూ మాచే పనులు చేయించుకుని, ఈరోజు న్యాయపోరాటం చేస్తున్న మాపై ప్రభుత్వం, అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడడం సబబు కాదన్నారు.ఉద్యోగాలని విద్యాశాఖలో విలీనం చేయాలని, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గ, రమేశ్ , వెంకటేశం లు పాల్గొన్నారు .