నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకోగా, వారికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నారని వారికి కనీస సౌకర్యాలు, ఉద్యోగ భద్రత లేదని ఏదైనా ఉద్యోగి ప్రమాదవశత్తు మరణిస్తే కనీస ప్రమాద బీమాసౌకర్యం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని వారు అన్నారు. ఇలా చేయడం వలన వారి కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసి కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కే రియాజ్, నాయకులు ఎండి సాజిద్, నిహాల్, అజయ్ సమగ్ర శిక్ష జిల్లా నాయకులు పాల్గొన్నారు.