ప్రతి నెల 1 నుండి 15 వరకు విధిగా రేషన్ సరఫరా చేయాలి

Compulsory supply of ration from 1st to 15th of every month– పిడిఎస్ బియ్యం విక్రయించిన.. కొనుగోలు చేసినా క్రిమినల్ చర్యలు
– రబీ సీఎంఅర్ ను పూర్తి చేయాలి
– అదనపు కలెక్టర్ శ్రీనివాస్ 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
చౌకధర దుకాణ డీలర్లు  ప్రతినెల 1 నుండి 15 లోపు  తప్పనిసరిగా  రేషన్  సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో చౌకధర దుకాణాల డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఎన్ఫోర్స్మెంట్  సిబ్బందితో సమావేశం నిర్వహించారు.డీలర్లు రేషన్ సరఫరాలో   సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఎవరైనా లబ్ధిదారుల నుండి పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినా లేదా పిడీస్ రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడిన ఆథరైజేషన్ రద్దు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు  రైస్ మిల్లర్లతో కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) చెల్లింపు పై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన వ్యవధి ప్రకారం సెప్టెంబర్ చివరినాటికి   2023- 24 ఖరీఫ్, అలాగే 2023- 2024 రబి  సీఎంఆర్ ను పూర్తి చేయాలని ఆదేశించారు.  ఇప్పటివరకు 2023- 24 ఖరీఫ్ కు సంబంధించి సి ఎం ఆర్ 61 శాతం, 2023- 24 రబీ 49 శాతం పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు , ఎప్సిఐ డివిజనల్  మేనేజర్ సుశీల్ కుమార్ షిండే,ఎంఎల్ఎస్  పాయింట్ల ఇన్చార్జీలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, చౌక ధర దుకాణాల డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు తదితరులు హాజరయ్యారు.