సామాజిక, ఆర్థిక అంతరాలు పోగొట్టడమే కామ్రేడ్ బలరాం ఆశయం..

Comrade Balaram's ambition is to eliminate social and economic gaps.నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండల కేంద్రంలో జయశ్రీ గార్డెన్స్ లో యుటిఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షులు కామ్రేడ్ అమరజీవి నల్లబెల్లి బలరాం గారి సంస్మరణ సభ సోమవారం నిర్వహించారు.ఈ  సందర్భంగా బలరాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరియు రాష్ట్ర జిల్లా నాయకులు ఈ సందర్భంగా సంస్మరణ సభకు టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మిర్యాల దామోదర్ అధ్యక్షత వహించారు.అమరజీవి నల్లబెల్లి బలరాం గారి సంస్మరణ సభలో నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి  మాట్లాడుతూ..  ఆర్థిక,సామాజిక అంతరాలు పోగొట్టి సమాజాన్ని బాగు చేయాలనేది కామ్రేడ్ బలరామ్ ఆశయమని దాని సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని,నేటి సమాజంలో విద్యలో వస్తున్న అంతరాలు తొలగిపోయేలా మనందరి కృషి ఉండాలని, ఆశయాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు బలరాo అని సమాజంలో నాణ్యమైన ఉచిత విద్యను అందజేస్తూ సామాజిక అసమానతలు తొలగించే విద్య అవసరమని నూతన విద్యా విధానంలో సమూలమైన మార్పులు చేసినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని నర్సిరెడ్డి అన్నారు.మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో చేరకముందే ప్రజాతంత్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొని అభ్యుదయ భావాలు గల యుటిఎఫ్ లో చేరి సంఘ విస్తరణకు తోడ్పడ్డారని,సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యారంగo అభివృద్ధికి తోడ్పడ్డారని సీతారాములు అన్నారు.
యూటీఎఫ్ అభివృద్ధి,ఉద్యమ ఆశయాల సాధనలో దీర్ఘకాల క్రియాశీల నాయకుడుగా బలరాం నిలబడ్డారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. జంగయ్య అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చావా రవి గారు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి నిబద్ధతగల కార్యకర్తగా నాయకుడిగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేశారని ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం అన్ని క్యాడర్లు అన్ని వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను సమీకరించి ఐక్య ఉద్యమాలు చేశారని రవి అన్నారు.ఉపాధ్యాయ విస్తరణతో పాటు కుటుంబ అభివృద్ధిని కూడా చూసుకుంటూ నిలబడ్డ గొప్ప నాయకుడని ఉమ్మడి నల్గొండ జిల్లా తొలితరం ఉద్యమ నిర్మాత మరియు టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జి.నాగమణి రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జాగటి యాకయ్య తొలి తరం యుటిఎఫ్ మాజీ అధ్యక్షులు ఎస్. ఆంజనేయులు నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముక్కెర్ల యాదయ్య టాప్రా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగ అరుణ యాదాద్రి జిల్లా టాప్రా ఉపాధ్యక్షులు రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు దొడ్డి స్వామి బొమ్మగాని ముత్యాలు,పజ్జూరు వెంకటరెడ్డి,కంచి రవికుమార్,కోసనం శ్రీనివాసులు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జీవీ రమణ రావు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు అనిల్ కుమార్,యుటిఎఫ్ సీనియర్ నాయకులు దోనూరి బుచ్చిరెడ్డి,  అవ్వారి గోవర్ధన్ నేత,కందుల మల్లారెడ్డి, పెండెం నాగార్జున,కుకుడాల గోవర్ధన్,పండగ తిరుమలయ్య,ఉపేందర్ రెడ్డి,కొండకింది అంజిరెడ్డి,మల్లు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.అమరజీవి నల్లబెల్లి బలరాం సంస్మరణ సభలో వారి సతీమణి  నల్లబెల్లి మాణిక్యం కుమారుడు డాక్టర్ క్రాంతి కుమార్ కోడలు డాక్టర్ శృతి కుమార్తె డాక్టర్ దీప్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.