ప్రజా ఉద్యమకారుడు అమరుడు కామ్రేడ్‌ బుగ్గన్న

ప్రజా ఉద్యమకారుడు అమరుడు కామ్రేడ్‌ బుగ్గన్ననవతెలంగాణ-దోమ
తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ప్రజలు, ఆనాడు పరిగి నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పల్లె పల్లె తిరిగి ప్రజా పోరాటాలు నిర్వహించిన బుగ్గన యాదవ్‌ అని అంబేద్కర్‌ యూనివర్సిటీ మాజీ రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ వెంకటయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుగ్గన్న రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ రాజ్యాధికారం కోసం ప్రజా చైతన్యం చేశారన్నారు. పరిగి నియోజకవర్గంలో బలహీనవర్గాల అభ్యర్థిని ఎమ్మెల్యేగా చూడాలని నిత్యం ఆరాటపడే వారన్నారు. ఆయన బతికుంటే 2014లో పరిగి ఎమ్మెల్యే అయ్యేవారన్నారు. ఉపాధ్యాయులు టి.వెంకటయ్య మాట్లాడుతూ బుగ్గన్న గొప్పతనం నేటికీ ప్రజల్లో ఉందన్నారు. 15 ఏండ్ల క్రితం అమరుడైన బుగ్గనను పరిగి పట్టణంలో ఆయన విగ్రహం పెడుతున్నారంటే బుగ్గన్న ముత్యా నిచారులు రామన్న మాదిగ,బందయ్యా యాదవ్‌, సునంద, బీఎస్‌ ఆంజనేయులు, విజరు కుమార్‌రెడ్డి, నర్సింలు, గోవింద్‌రెడ్డి, బుగ్గన్న అనుచరులు చాలామంది నిత్యం ప్రజా చైతన్యంలో ఉన్నారంటే బుగ్గన్న ఆశయం నేటికీ బతికున్నట్లే ప్రజా చైతన్యం చేస్తున్న వీరందరికీ తెలంగాణ ఉద్యమా భివందనాలు అన్నారు. కార్యక్రమంలో తరుణ్‌ యాదవ్‌, ఆంజనేయులు గౌడ్‌, సత్యగౌడ్‌, దస్తయ్య, మహేష్‌ లక్కీ, దస్తగిరి, కళాకారులు రాజు, శంకర్‌, రామ్‌రెడ్డిపల్లి ప్రజలు, ముజాహిద్పూర్‌ ప్రజలు, బుగ్గన్న అభిమానులు పాల్గొన్నారు.