22న పంతంగిలో కామ్రేడ్ కందాల రంగారెడ్డి వర్ధంతి మహాసభ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
కీర్తిశేషులు కామ్రేడ్ కందాల రంగారెడ్డి వర్ధంతి మహాసభ ఈనెల 22 గురువారం రోజున పంతంగి చౌటుప్పల్ గ్రామాలలో జరుగుతుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగాదేవి సైదులు తెలిపారు. కామ్రేడ్ కందాల రంగారెడ్డి వర్ధంతి మహాసభకు ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ హాజరవుతున్నారని గంగాదేవి సైదులు తెలిపారు.