కామ్రేడ్ ఎన్‌వి భాస్కర్‌రావును తలచుకుని కా,, సుందరయ్య సభలో కంటనీరు పెట్టుకున్నారు. మాటలు కొన్ని క్షణాలు ఆగటంతో పాటు కంటనీరు పెడ్తూనే, సర్దుకుని ఒక మాట అన్నారు. ”అమరజీవి భాస్కరరావు నాకు సోదరుడి లాంటి వాడు, ఆడుకుంటున్న వయస్సులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంవైపునకు, ఎర్రజెండావైపునకు ఆకర్షితుడ య్యాడు. ఉద్యమ ప్రస్థానంలో కొరియర్‌గా పనిచేశాడు.” అం టూ ఆయన నిబద్ధత ఈ సభలో ”కా||భాస్కరరావు స్మారక భవ నం” ఏర్పాటు ఒక అంశం అయితే, మరో అంశం కా||భాస్క రరావు ఉద్యమ ప్రస్తానం, ఆనాటి సుందరయ్య మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేయటంతో పాటు బాధ్యతను పెంచాయి. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మెదలుతూనే ఉన్నాయి.
భాస్కరరావు చిన్న వయస్సులో ఉండగానే తండ్రిని కోల్పోయారు. భాస్కరరావును తల్లి అతి గారాబంగా పెంచింది. పదహారేండ్ల వయస్సులోనే కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఆకర్షితుడయ్యాడు. ఎర్రజెండా భుజానికెత్తుకున్నాడు. చదువుకు స్వస్తి చె ప్పి ఉద్యమంవైపు దూకాడు. నిర్బంధకాలంలో క మ్యూనిస్టు అగ్రనాయకులకు కొరియర్‌గా పనిచేశా డు. చిన్నవయస్సులోనే గొప్ప పరిణితి కనపర్చాడు. వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిగా అనేక ఆలోచనల్లో మునిగి పోయేవారు. ఈ స్థితిని చూసి సహజంగానే బిడ్డ అందుకోలేని దశకు వెళ్తున్నట్లు గమనించి తల్లి తీవ్ర ఆందోళన చెందింది. ఆ తర్వాత కాలంలో అనేకమంది పెద్దలు ఆ తల్లి ఆందోళనను తగ్గించడానికి ప్రయత్నిస్తూ నచ్చచెప్పటమే కాక, నీ బిడ్డ చెడి పోవడంలేదు అని చెప్పారు. పెళ్లి చేస్తే కుదుటపడతాడని భా వించి సక్కుబాయిని ఇచ్చి పెళ్లి చేసింది. అనంతరం హైదరా బాద్‌కు నివాసం మారింది. ఎర్రజెండా, కమ్యూనిస్టు ఉద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధునితో పరిచయం, ఉద్యమ ప్రస్తానం కొనసాగింది. అనంతరం న్యాయవాదిగా వృత్తి నిర్వహణ చేపట్టగా చివరగా కామ్రేడ్ సుందరయ్య ప్రత్యక్ష జోక్యంతో పార్టీ హైదరాబాద్ బాధ్యతలు చేపట్టడం ముఖ్యమైన ఘట్టాలు. భార్య సక్కుబాయి ఉపాధ్యాయురాలు. మహిళా ఉద్య మాల్లో చురుకుగా పాల్గొన్నారు. ముగ్గురు అమ్మాయిలు విద్యావంతులు. పిల్లల్లో కూడా కమ్యూనిస్టు చైతన్యం నింపారు.
1964, 1967 మితవాద, అతివాద చీలికల అనంతరం కమ్యూనిస్టు పార్టీని హైదరాబాద్‌లో పునర్మించటంలో భాస్కర్ రావు ముఖ్యభూమిక పోషించారు. వీరితోపాటు పి.లక్ష్మీదాస్, ఎ.రాంరెడ్డి ఉద్యమంలో పాల్గొన్నారు. 1975 సం|| ఎమర్జెన్సీకి ముందుగానే పార్టీ నగర ప్రథమ మహాసభ సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. కా||సుందరయ్య పాల్గొన్నారు. పార్టీ నగర కమిటీ ఐదుగురు సభ్యులతో ఏర్ప డింది. కామ్రేడ్స్ ఎన్‌వి భాస్కరరావు ప్రథమ కార్య దర్శిగా, సభ్యులుగా పి.లకిëదాసు, ఎం పూర్ణచం ద్రరావు, ఆర్ రఘుపాల్, డిజి నర్సింహారావు ఎన్ని కైనారు. ఆ తర్వాత జరిగిన రెండు, మూడు మహా సభలలో కూడా కార్యదర్శిగా ఉన్నారు. కార్యదర్శి బాధ్యతల్లో ఉండగానే 1984లో చనిపోయారు.
టియు, విద్యార్థి, యువజన, మహిళ, సాం స్కృతిక రంగాలు, ఆంతరంగిక నాయకత్వాన్ని అభి వృద్థి చేయటం, కార్యకర్తలకు రాజకీయ విద్యతో పాటు ప్రజా సమస్యలపై నిర్థిష్ట కార్యాచరణ, ప్ర జాసంఘాల సభ్యత్వ చేర్పింపు, పార్టీ నిర్మాణ ఏర్పా ట్లు జరిగాయి. పార్టీ కార్యకర్తల పోషణకోసం నిరంతరం నిధిని సేకరిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ప్రత్యే కంగా 1970-80 మధ్యకాలంలో పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, ఈసిఐఎల్, హెచ్‌ఎంటి, బిహెచ్‌ఇఎల్, ఐటిపిఎల్, హెచ్‌ఏఎల్, హెచ్‌ఎంటి బేరింగ్‌లో అప్పటికే రాజ్యం ఏలుతున్న ఐఎన్‌టి యుసి, హెచ్‌ఎంఎస్, ఏఐటియుసిల రాష్ట్ర నాయకులు సంజీ వరెడ్డి, భద్రి విశాల్ పిళ్లై, కెఎల్ మహీంద్ర వంటి పాతుకు పోయిన నాయకులను ఎదుర్కొవడానికి ఆయా పరిశ్రమల్లో, కార్మికుల్లో స్ధానిక నాయకులను ప్రత్యేకించి తయారు చేయడా నికి ప్రాధాన్యతనిచ్చారు. వారికి అవసరమైన రాజకీయ చైత న్యం అందించడం కారణంగా సీఐటీయు నాయకత్వం ధైర్య సా హసాలను ప్రదర్శించి, బలోపేతమైన పోరాటాలు నిర్వహించి అనేక విజయాలతో ముందుకు సాగింది. ప్రత్యేకించి క్షేత్ర స్థాయికి దిగి అన్ని పారిశ్రామిక వాడల్లో తాను, తనతో పాటు కొత్తవారిని యూనియన్లకు నాయకులుగా తయారు చేశారు. హైదరాబాద్‌లో కార్మికోద్యమ నాయకుడు కా|| ఎన్వీ.
ఎమర్జెన్సీ అనంతర కాలంలో జరిగిన పార్లమెంటు ఎన్ని కలు (1977 నవంబర్), 1978 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా క్యాంపెయిన్ నడిచింది. జరిగిన అన్ని పోరాటాల లో పార్టీ ముందు భాగాన నడిచింది. ఎమర్జెన్సీ ఉపసంహరణ అనంతరం జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మనం జన తా పార్టీతో దేశవ్యాపితంగా ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాము. ఆనాడు సర్దుబాటులో భాగంగా హైదరాబాద్ రాజధానిలో సన త్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం సీపీఐ(ఎం)కు కేటాయించారు. అభ్యర్థిగా కా||ఎన్‌వి భాస్కరరావును నిర్ణయించి ప్రకటించింది. సీపీఐ(ఎం) పార్టీగా మొదటిసారి ఎన్నికలో పోటీచేసాము. మూ డు మాసాలపాటు వందలాదిమంది పార్టీ, ప్రజాసంఘాల కార్యకర్తలు, విద్యార్ధులు, యువతీయువకులు ఒ క్కటై, ఉమ్మడిగా ఉడుం పట్టులాగా రాత్రి పగలూ శ్రమించారు. 1978 ఫిబ్రవరి 25న ఓటింగ్, ఎన్నికల ఫలి తాల వరకూ మొక్కవోని దీక్షతో కృషి చేసారు. మన పార్టీ అభ్యర్థి కేవలం 1760 ఓట్లతో ఓడిపోయారు. అప జయం పాలైనా మొట్టమొదటిసారి పోటీ చేసిన పార్టీ అభ్యర్ధి భాస్కర రావుదే గెలుపని ప్రజలు అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పని చేసిన కొంతమంది యువతీయువ కులు కొన్ని నెలలపాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయి నప్పటికీ చైతన్యం ప్రదర్శించారే తప్ప వెనుకడుగు వేయలేదు.
1977 నవంబర్‌లో దివిసీమ ఉప్పెన. ఆనాడు పార్టీ మొ త్తం ఆపదలో ప్రజలకు చేయూతనివ్వాలని నడుం బిగించింది. కా||సుందరయ్య నాయకత్వంలో, సుందరయ్యతో సహా మో కాలు లోతున నీటిలో సహాయచర్యలు చేపట్టింది. కా||జ్యోతి బసు పర్యటించారు. బాధితుల సహాయార్ధం పార్టీ కార్యదర్శి కా||ఎన్‌వి భాస్కరరావు సారధ్యంలో పెద్దఎత్తున ఆర్థిక, వస్తు, బట్టలు, బియ్యం సేకరించి పెద్ద సంఖ్యలో పంపాలని నిర్ణ యించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ పట్టణాల బస్తీలు, వ్యా పారకేంద్రాలు వారం రోజులపాటు వందలాది కార్యకర్తల కృషి తో రూ.3లక్షలు, 150 బస్తాల బియ్యం, పెద్ద ఎత్తున బట్టులు సేకరించి కా||భాస్కరరావు నాయకత్వంలో 40మంది బృందం వెళ్ళి సహాయక చర్యలు చేపట్టింది.
పార్టీ నగర కార్యదర్శిగా, టియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్య దర్శిగా కా||భాస్కర్‌రావు బాధ్యతలు నిర్వహించారు. నగరంలో పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, బ్యాంక్, ఇన్సూరెన్స్ రంగాలతో పా టు, కేంద్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఉద్యమాల బాధ్యతే కాకుండా, ప్రత్యక్షంగా ఇసిఐఎల్, బిహెచ్‌ఇఎల్, ఆర్ అండ్‌డి, హెచ్‌సిఎల్, ఏపి స్కూటర్స్, గవర్న మెంట్ ప్రెస్, ప్రయివేట్ రంగ పరిశ్రమల యూనియన్లను ప్రత్యక్షంగా చూసేవారు. టి యు రాష్ట్ర కార్యదర్శిగా (టియు రాష్ట్ర కేంద్రం విజయవాడలో సుదీర్ఘకాలం ఉన్న కారణంగా) రాష్ట్ర బాధ్యతలు, లేబర్ కమిషనర్, రిప్రజెంటే షన్స్, జాయింట్ మీటింగులతో పాటు రాష్ట్రం లో వివిధ సందర్భాలలో అవసరాల కోసం జిల్లాలకు వెళ్తుండేవారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, రాష్ట్ర పార్టీ అవసరాలు కూడా చూ స్తుండేవారు. పారిశ్రామిక కేంద్రమైన హైదరా బాద్‌లో కార్మికోద్యమం నిర్మించాలన్న పార్టీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
నాకు భాస్కరరావుకు ఫ్రెండ్లీ, ఎల్డర్లీ, గౖౖెడింగ్ ఫిగర్. భాస్కర్‌రావుకు ఆత్మాభిమానం, పట్టుదల ఎక్కువ. ఆందోళన ఉన్నా బయటపడేవారు కాదు. ఆయనతో కలిసి ఉన్న కాలం కన్నా దూరమైన కాలం 38 ఏండ్లు. అతి ఎక్కువ కాలం. ఆయన లేనికాలంలో, ఉన్నకాలంలో నాపై ఒకే రకమైన ప్రభావం ఉంది. ఎల్లప్పుడూ భాస్కరరావును మరచి పోలేను. అన్నివేళలా ఆయన నాకు స్ఫూర్తి. మరచిపోలేని అను భూతి. అందుకే నా దృష్టిలో ఆయన చిరస్మరణీయుడు.
(నేడు ఎన్వీ భాస్కర్‌రావు 93వ జయంతి)
డి జి నర్సింహారావు 9490098580