
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 39 వర్ధంతిని హాలియాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంగం రాష్ట్ర కమిటీ సభ్యులు కున్ రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ.. అణగారిన అట్టడుగు వర్గాల ప్రజల కోసం అనేకమైన పోరాటాలు ఉద్యమాలు చేసి పేదలకు ఏన్నో భూములు పేదల కోసం దానం చేసి మహోన్నత ప్రక్యాతి గాంచిన మహోన్నతమైన వ్యక్తి అప్పట్లోనే పార్లమెంట్ సభ్యుడు గా ఉండి పార్లమెంట్ కి కూడా సైకిల్ మీద వెళ్లి ప్రజల గొంతుక గా ఉంటూ అనునిత్యం ప్రజల సమస్యల పై ఎన్నో విప్లవ పోరాటాలు చేసిన వ్యక్తి, నాటి యువత కి ఎంతో ఆదర్శమైన వ్యక్తి నీ స్మరిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రైతు సంగం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి, ఐద్వ జిల్లా సహాయ కార్యదర్శి కారం పుడి ధనమ్మ , పెద్దవూర సీఐటీయూ నాయకులు షేక్ బషీర్, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు రెబెల్లి వెంకటేశం, భవన నిర్మాణ అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు వెంకటయ్య, షేక్ కాషీం, ఎస్ ఎఫ్ ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కోరే రమేష్, నాయకులు వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.