
కీ.శే. రావి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం, గౌరవార్థం, ఆయన విశిష్ట జీవితం భవిష్యత్ తరాలకు తెలియ చేసేందుకు, “నిలువెత్తు, చేతి కర్రతో ఉన్న కాంస్య విగ్రహం, ఆయన పుట్టి పెరిగిన స్వంతూరు బొల్లేపల్లిలో అందరి సహాయ సహకారాలతో, రానారె సంస్థ మరో ముందడుగు వేయడం జరిగిందనీ, ఈరోజు హైదరాబాదులో ఉన్న ఒక ప్రముఖ కాంస్య విగ్రహాల తయారీ యూనిట్ సంస్థ సభ్యులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను, ఇంతకు ముందు చేసిన వారితో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, లోహాలు మిశ్రమాలు, నాణ్యత, జీవిత కాలం, ఎత్తు, బరువు, వీరు చేసిన ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు, జనగాంలో ప్రతిష్టించ బోతున్న అతి పెద్ద బమ్మెర పోతన విగ్రహం లాంటి వివిధ విషయాల మీద కూలంకషంగా చర్చించారు. కీ.శే. రావి నారాయణ రెడ్డి కాంస్య విగ్రహం పరిమాణాలు, తీరుతెన్నులు కూడా ఇవ్వడం జరిగింది. రెండు రోజులలో విగ్రహం నమూనా ఫోటో, రానారె కాంస్య విగ్రహ ఏర్పాటుకు మరో అడుగు ముందుకు వేసినట్టుగా భావిస్తున్నామనారు. ఈ సంస్థ ప్రతినిధులు చెరుకుపల్లి శ్రీనివాసు అధ్యక్షులు, రావి సుకేష్ రెడ్డి కార్యదర్శి, తిరుమణిదాసు వేంకటేశ్వర్లు కోశాధికారి ఉన్నారు.