కామ్రేడ్ తొట్ల మల్సూర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ తోట్ల మల్సూర్ ఆశయ సాధనకు కృషి చేయాలని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర  కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని  ధర్మ భిక్షం భవన్ లో ఆయన 25వ వర్ధంతి సందర్భంగా  గీత పనివారాల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడని తెలిపారు. గీత కార్మికుల హక్కుల సాధనకు ఎంతో కృషి చేశాడని   తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా  జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు రేగట్టె లింగయ్య, జిల్లా నాయకులు తొట్ల ప్రభాకర్, బూర వెంకటేశ్వర్లు, గోపగాని రవి, దీకొండ రవి, తదితరులు పాల్గొన్నారు.