మండలంలోని బోర్గాం ( కె ) గ్రామంలో కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 34వ వర్ధంతి సభను ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు దేశెట్టి సాయి రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ కిరణ్ కుమార్ జిల్లాలో యువతను కూడగట్టి చెడు దారిన పట్టకుండా గ్రామ గ్రామాల్లో యువజన సంఘాలను పెట్టి గ్రామాల్లో గుండాయిజానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ధైర్యశిలి అని, యువజన ఉద్యమంలో యువకుల పాత్ర ఏ విధంగా ఉండాలనో స్వయానా అది బోరుగాం. K. గ్రామంలో చేసి చూపించారాన్నారు. జిల్లాలో సింగిల్ నెంబర్ లాటరీలను నిషేధించాలని, యువత క్యాన్సర్ బారిన పడకుండా గుట్కా ఉద్యమాన్ని జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రాలో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందని, దీని ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గుట్కా అమ్మకాలను నిషేధిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు.
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పాలకవర్గాల అనుసరిస్తున్న విధానాలకు ఎప్పటికప్పుడు యువతరం ఆలోచించి పోరుబాటలో ముందుండాలని అలాంటప్పుడే కామ్రేడ్ కిరణ్ కోరుకున్న కలలు నెరవేరుతాయని తెలిపారు. ఈ వర్ధంతి సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డి బన్సీ , మండల కార్యదర్శి శీర్రం శంకర్, రాపని గంగాధర్, రమేష్, భూమన్న, బుచ్చన్న , తదితరులు పాల్గొన్నారు.