బోర్గం గ్రామంలో కామ్రేడ్ యాదగిరి సంస్మరణ సభ…

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో మంగళవారం కామ్రేడ్ యాదగిరి సంస్కరణ సభను సిపిఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆధునిక కమ్యూనిస్టుగా యాదగిరి అన్న ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, విప్లవం ఉద్యమాన్ని నడిపించాడని వారు కొనియాడారు. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విప్లవ పోరాటఉద్యమాన్ని ప్రారంభించి తన ఉద్యోగాన్ని వదులుకొని సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో విప్లవం నడిపించారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ నాయకులు గుమ్ముల గంగాధర్, పుట్టి నడిపి నాగన్న, పార్వతీ రాజేశ్వర్, వడ్డెన్న, ఎస్కే నసీర్, సంతోష్, పెద్దుల, ఎల్ గంగాధర్, సిద్ధ పోశెట్టి, సుదర్శన్ గౌడ్, మన్నె పోశెట్టితో పాటు పలువురు పాల్గొన్నారు.