డీఈఓ ఎదుట యాదవుల ఆందోళన

Concern of Yadavs against DEO– అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపణలు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
డీఎస్సి 2024 నియామకాల్లో డీఈవో కార్యాలయంలో అక్రమాలు జరిగాయని, అనర్హులకు పోస్టింగ్ ఇచ్చి విధుల్లో చేరిన అభ్యర్థులకు అన్యాయం చేశారని యాదవ సంఘం నాయకులు ఆరోపించారు. ఈ విషయమై శనివారం సంఘం ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. తలమడుగు మండలం కుచులాపూర్ లో ఉపాధ్యాయుడిగా నియామకమైన నవీన్ యాదవ్ ను రోస్టర్ లో దొర్లిన పొరపాటుతో సర్వీసును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అనంతరం యాదవులు కలిసి డీఈవో ను కలిసి వినతిపత్రం అందజేసి ఆ తర్వాత కలెక్టర్ రాజర్షి షా ను కలిసి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు హన్మండ్లు యాదవ్, నారాయణ యాదవ్, రామన్న యాదవ్, ప్రఫుల్, దేవారెడ్డి, రవికాంత్, తాంసి గ్రామ మాజీ సర్పంచి కృష్ణ పాల్గొన్నారు.