వచ్చేనెల 15 నుంచి ఆందోళనలు

– అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం
నవతెలంగాణ – ఆర్మూర్
వ్యవసాయ ఉత్పత్తి,సాధనాలుమినీ ట్రాక్టర్స్… అన్ని రకాల విత్తనాలపై 50% సబ్సిడీ కొరకు వచ్చేనెల 15 నుంచి జూన్ మొదటి వారం వరకు అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన.. కార్యదర్శులు.వి. ప్రభాకర్ బి దేవారం లు అన్నారు. అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం హైదరాబాదులో సిపిఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో అధ్యక్షులు చంద్రశేఖర అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది అని, నిర్ణయాలు వివరించడానికి మాస్ లైన్ పార్టీ కార్యాలయం కుమార్ నారాయణ భవన్ లో శనివారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు. మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పసులపై చర్చించి ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది అని గత దశాబ్దం, క్రితం వ్యవసాయ ఉత్పత్తి సాధనాల పైన.. యంత్రాల పైన.. ఎరువులకు, పురుగు మందులు.. రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వాలు ఇచ్చేవి, కానీ రైతాంగానికి పెద్ద పీట వేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మొత్తం సబ్సిడీలను రద్దు చేసి సర్వరోగ నివారిణి రైతుబంధుగా చూయించి తీరని అన్యాయం చేశారని, సబ్సిడీలను కొనసాగించాలని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో లక్ష రూపాయలు ఏకకాలం రుణమాఫీ చేస్తానని చెప్పి దశలవారీగా వడ్డీల మాత్రమే రద్దుచేసి, అసలు అలాగే మిగలడంతో నూతన అప్పులు బ్యాంకు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వారినిఆశ్రయించాల్సిన స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు లక్షల వరకు బాకీలు ఉన్నవారు ఎవరు కట్టకండి మేము అధికారులు రాగానే ఏకకాలం రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేయడమే కాకుండా తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు.. రద్దు చేయకపోవడంతో బ్యాంక్ అప్పులు మంజూరు కాక రైతులు నానా తిప్పలు పడాల్సిన స్థితి ఏర్పడిందని గుర్తు చేస్తూ ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని..డిమాండ్ చేస్తూ మే 15వ తేదీ నుండి జూన్ మొదటి వారం వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్రంలో ఆందోళనకు పిలుపునిచ్చిందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రకృతి విలయతాండంలో రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం పొందితే ఏ ఒక్క రైతును కూడా ఆదుకోకపోవడం విచారకరమని, ఈరబీ సీజన్లో కోతకొచ్చిన వరి.. ఆరబోసిన వరి ధాన్యం.. నువ్వులు…పసుపు… తదితర పంటలు నష్టపోయాయని.. ఒకవైపు ముఖ్యమంత్రి గారు.. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఒక గింజ తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని మైకులు పగిలిపోయేటట్టుగా ప్రతినిత్యం పత్రికల్లో టీవీలలో ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ రైస్ మిల్ యజమానులు మాత్రం రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లిన తర్వాత తాలుందని, తడిసిందని, అనేక కారణాలు చూయిస్తూ రోజుల తరబడి రైస్ మిల్లుల వద్దనే ధాన్యాన్ని దించుకోకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా.. నిజామాబాద్ జిల్లా కొంతమంది దళారీలు హమాలీ చార్జీలను తీసుకోమని.. తరుగు తీసుకోమని,, ఖల్లాల వద్దనే కొనుగోలు చేసి రైతులకు టోకరా కొట్టిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు.. నిజామాబాదు రైస్ మిల్ యజమానులు కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోకుండా ఇబ్బందులు గురిచేసి 5,6 కిలోల తరుగు ఇస్తేనే తీసుకునే విధంగా మేము బలవంతం చేయట్లేదని రైతుల ఇస్తున్నారని బుకాయిస్తున్నారని అన్నారు… పిడుగుపాటుకు నిజాంబాద్ జిల్లాలో పశువులు.. ప్రాణా నష్టం కూడా జరిగిందని వీటికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… ఎకరాన రూ.25000… వాణిజ్య పంటలకు… పండ్ల తోటలకు రూ.50 వేలు చొప్పున నష్టపోయారని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని కేవలం బ్యాంకు రుణాలు పొందిన వారికి మాత్రమే వర్తింప చేస్తున్నారని ఆ విధంగా కాకుండా సాగు చేసిన ప్రతి ఒక్కరికి పంటల బీమా పథకాన్ని చెల్లించే వాటదనాన్ని ప్రభుత్వం చెల్లించి అన్ని పంటలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో 10 సంవత్సరాల కాలం పరిపాలించిన బీజేపీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు మూడు నల్ల చట్టాలని ప్రవేశపెట్టడంతో రైతాంగ ఉద్యమం 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా సాగిందని,ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని దేశ రైతాంగానికి ప్రధాని క్షమాపణ చెప్పిMSP గ్యారెంటీ చట్టం తెస్తానని.. రైతులపై పెట్టిన కేసులు రద్దు చేస్తానని… ఉద్యమంలో అమరులైన 750 కుటుంబాలను ఆదుకుంటామని రాతపూర్వక హామీ ఇచ్చి మోసం చేశారని ఎద్దేవా చేశారు… ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక పార్లమెంట్ సభ్యుడు పసుపు బోర్డు,,, పసుపును..MSP జాబితాలో చేర్చి 15 వేల రూపాయల ధర వచ్చే విధంగా చేస్తాననిఐదు రోజుల్లో తెస్తానని. 100 రూపాయల బాండ్ పేపర్ పై రాతపూర్వక హామీ ఇచ్చి మోసం చేశాడు… ఒకవైపు భారత ప్రభుత్వం మోసం చేస్తే నిజాంబాద్ పార్లమెంటు పరిధిలో రైతాంగాన్ని అరవిందు మోసం చేశాడని రైతాంగ శ్రేయస్ కొరకు అరవింద్ ని… బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు.. ఆకుల గంగారాం… యు.రాజన్న,టి.గంగాధర్  తదితరులు పాల్గొన్నారు.