ముగిసిన ఎఫ్‌బీఓ కౌన్సెలింగ్‌

Navatelangana,Adilabad,Telugu News,Telangana,నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో అటవీ శాఖ బీట్‌ అధికారుల బదిలీల ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌ కుమార్‌ టిబ్రేవాల్‌ ఆధ్వర్యంలో ఎఫ్‌డీఓ వేణుబాబు, ఎఫ్‌ఆర్‌ఓ అప్పలకొండలు కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ అటవీ పర్యవేక్షణలో బీట్‌ అధికారుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. జిల్లాలో 57 మందికి బదిలీ జరిగిందని నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే కొంతమందికి అనుకున్న ప్రాంతంలో బీట్‌ దొరకలేదని వారివారి సామర్థ్యం మేరకు జిల్లా అవసరాల మేరకు బీట్‌లు కేటాయించామన్నారు. కేటాయించిన బీట్‌లో విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి యోగేష్‌, సిబ్బంది పాల్గొన్నార